Friday, November 22, 2024
HomeTrending Newsవిశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

విశాఖ తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి భారీ స్థాయిలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. విశాఖ సముద్ర తీరప్రాంతంలో 25 వేల కిలోల డ్రగ్స్ ను సిబిఐ అధికారులు సీజ్ చేశారు. ఈ కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖకు చేరుకుంది. డ్రై ఈస్ట్ సరఫరా మాటున ఒక్కో బ్యాగ్ లో 25 కిలోల చొప్పున మొత్తం వెయ్యి బ్యాగుల్లో డ్రగ్స్ చేరుకున్నట్లు అధికారులు నిర్ధారించారు. విశాఖలోని సంధ్యా ఎక్స్ పోర్ట్స్ కంపెనీ పేరుమీద ఈ కంటైనర్ వచ్చినట్లు ప్రాధమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

18వ తేదీన ఓ ఈ మెయిల్ ద్వారా సిబిఐకి దీనిపై సమాచారం వచ్చింది. వెంటనే అధికారులు ఇంటర్ పోల్ సాయంతో ఈ డ్రగ్స్ రాకెట్ ను ఛేదించారు. దీనికి ఆపరేషన్ గరుడగా నామకరణం చేసిన అధికారులు ఈ సాయంత్రం ఈ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. నేడు పట్టుబడ్డ డ్రగ్స్ విలువ షుమారు 50 వేల కోట్ల రూపాయల పైమాటేనని సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్ స్వాధీనం చేసుకోవడం ఇదే మొదటిసారి అని అధికారులు వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్