Saturday, January 18, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్వాహనమిత్ర గడువు పొడిగించాం

వాహనమిత్ర గడువు పొడిగించాం

వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి దరఖాస్తు గడువును 6 జులై, 2021 వరకు పొడిగించామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) తెలిపారు.  2021-22 సంవత్సరానికిగానూ 15 జూన్, 2021న 2,48,468 మంది వాహనదారులకు రూ.249 కోట్లు ముఖ్యమంత్రి అందజేశారని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు.  వైఎస్సార్ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అర్హులైన ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఉంటె వారు తమ గ్రామ /వార్డు సచివాలయాల్లో అవసరమైన అన్ని పత్రాలు సమర్పించి, దరఖాస్తు చేసుకోవాలని మంత్రి పేర్ని కోరారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించామన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్