యాదగిరిగుట్ట దేవాలయంలో ఈ రోజు(బుధవారం) చిరుధాన్యాల ప్రసాదం, స్వామి వారి బంగారు, వెండి నాణేల విక్రయాన్ని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
అంతకుముందు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి వారిని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానికి వచ్చిన మంత్రికి దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఆలయ ఈఓ, అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి ప్రధాన ఆలయంలో స్వయంబు దేవుడిని దర్శించుకున్న మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.
వేద పండితులు మంత్రిని ఆశీర్వదించగా, ఆలయ ఈవో శ్రీస్వామివారి ప్రసాదాన్ని అందచేశారు. ఈ కార్యక్రమంలో తదితరులు ఉన్నారు.