Saturday, March 14, 2026
Homeసినిమామెగా ఫ్యామిలీకే కండీషన్ పెట్టడం నిజమా.?

మెగా ఫ్యామిలీకే కండీషన్ పెట్టడం నిజమా.?

వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఎంగేజ్ మెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికీ వీరిద్దరూ లవ్ చేసుకుని మ్యారేజ్ వరకు వచ్చారు ఎంగేజ్ మెంట్ జరిగిందంటే కొంత మంది నమ్మలేకపోతున్నారు. అయితే… ఈ మ్యారేజ్ కోసం లావణ్య త్రిపాఠి మెగా ఫ్యామిలీకే ఓ కండీషన్ పెట్టిందనే వార్త ప్రచారంలోకి వచ్చింది. ఆ కండీషన్ కి మెగా ఫ్యామిలీ ఒప్పుకున్న తర్వాతే మ్యారేజ్ కి ఎస్ చెప్పిందట. ఇంతకీ ఏంటా కండీషన్ అంటారా.? లావణ్యకు భరతనాట్యం అంటే చాలా ఇష్టమట. అందుచేత పెళ్లైన తర్వాత కూడా తనకు స్టేజ్ పైన భరతనాట్యం చేసే అవకాశం వస్తే అడ్డు చెప్పకూడదనే కండిషన్ పెట్టిందట.

పెళ్లి తర్వాత నటనకైతే దూరంగా ఉంటాను కానీ… భరతనాట్యంకు దూరంగా ఉండలేను అని చెప్పందట. అలాగే నిర్మాణ రంగం వైపు ఆసక్తి ఉందని.. నిర్మాతగా సినిమాలు నిర్మిస్తానని చెప్పిందట. దీనికి వరుణ్ తేజ్ తో పాటు, మెగా ఫ్యామిలీ ఒప్పుకుందట. అందుకనే వరుణ్‌ తో మ్యారేజ్ కి ఓకే చెప్పిందని టాక్. డిసెంబర్ లో పెళ్లి చేసుకోనున్నారని అంటున్నారు. త్వరలోనే పెళ్లి ఎప్పుడు..? ఎక్కడ..? అనేది ప్రకటించనున్నారు.

మరో విషయం ఏంటంటే.. ఈ పెళ్లి నాగబాబుకు ఏమాత్రం ఇష్టం లేదట. అందుకనే గత కొంతకాలంగా నాగబాబు, వరుణ్‌ తేజ్ విడివిడిగా ఉంటున్నారట. లవ్ మ్యారేజ్ వద్దని చాన్నాళ్లు చెప్పారట కానీ.. ఎంతకు వినకపోవడంతో ఓకే చెప్పారట. ఆమధ్య ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూలో కూడా నాగబాబు.. వరుణ్ తేజ్ మ్యారేజ్ గురించి స్పందించాడు. వరుణ్ ఇష్టమని.. పెళ్లి గురించి అతనే అనౌన్స్ చేస్తాడని చెప్పారు కానీ.. అంతకు మించి మాట్లాడడానికి ఇష్టపడలేదు. దీనికి కారణం ఈ పెళ్లి ఇష్టం లేకపోవడమే అని ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular