Sunday, February 23, 2025
HomeTrending NewsAmbati: వారి మధ్య బంధం అలాంటిది: అంబటి రాంబాబు

Ambati: వారి మధ్య బంధం అలాంటిది: అంబటి రాంబాబు

చంద్రబాబుకు ఐటి నోటీసుల విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చట్టానికి అడ్డుపడితే చర్యలు తప్పవన్నారు. సత్తెనపల్లిలో అంబటి మీడియాతో మాట్లాడుతూ చట్టం దృష్టిలో బాబు అయినా ఇంకెవరైనా ఒకటేనని వ్యాఖ్యానించారు.  తప్పు చేశాడు కాబట్టే బాబు భయపడుతున్నారని, దీన్ని ఆడ్డు పెట్టుకొని సింపతీ కోసం తెగ తాపత్రయపడుతున్నారని విమర్శించారు.

అరెస్టు చేయాల్సిన పరిస్థితి వస్తే చేస్తారని, ఆధారాలు లేకుండా ఎవరిపైనా కేసు పెట్టారు కదా అని అంబటి ప్రశ్నించారు. బాబు ముడుపులు తీసుకున్నారన్న ఆధారాలు ఉన్నా పవన్ కళ్యాణ్ నోరు విప్పడం లేదని విమర్శించారు.  బాబు దొంగ అని తెలిసినా పవన్  ఆయన్ను హీరో అనే అంటారని, వారిద్దరి మధ్య ఉన్నసంబంధం అలాంటిదని వ్యాఖ్యానించారు.

బాబు కొడుకులు చంద్రబాబు, లోకేష్ కు తమది రాక్షస ప్రభుత్వంలా కనిపించడంలో ఆశ్చర్యం లేదని.. వారు పాలనలో ఉంటేనే అది మంచి ప్రభుత్వం అంటారని ఎద్దేవా చేశారు. కానీ ప్రజలందరికీ తమది సంక్షేమ ప్రభుత్వంలా కనిపిస్తోందని అంబటి అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్