Saturday, January 18, 2025
Homeసినిమాటాలీవుడ్ దర్శకుడితో లారెన్స్!  

టాలీవుడ్ దర్శకుడితో లారెన్స్!  

లారెన్స్ .. నృత్య దర్శకుడిగా .. నటుడిగా .. దర్శకుడిగా తనని తాను నిరూపించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ విజయాలను అందుకుంటూ వెళుతోంది. ‘కాంచన 3’ తరువాత లారెన్స్ కొంత గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాపులో ఆయన ఇతర దర్శకుల సినిమాలలో చేశాడు. అయితే అవి ఆశించినస్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం ఆయన ‘కాంచన 4’ పనులతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కోసం అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో లారెన్స్ మరో తెలుగు సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి కిశోర్ దర్శకత్వం వహించనున్నాడు. హాస్య మూవీస్ బ్యానర్ పై రాజేశ్ దండా ఈ సినిమాను నిర్మించనున్నాడు. ఇటీవలే లారెన్స్ ను కలిసిన కిశోర్ ఆయకి ఒక కథను వినిపించాడట. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన కథ కావడం .. తన సినిమా నుంచి ప్రేక్షకులు ఆశించే అంశాలు ఉండటం వలన లారెన్స్ ఈ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు.

కిశోర్ ఇంతకుముందు శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ చేశాడు. ఆ సినిమా అంతగా ఆడలేదు. అప్పటి నుంచి కసరత్తు చేస్తూ వచ్చిన కథనే ఇప్పుడు సెట్స్ పైకి తీసుకుని వెళ్లనున్నాడని అంటున్నారు. లారెన్స్ కి కథ .. స్క్రీన్ ప్లే పై మంచి అనుభవం ఉంది. అలాగే దర్శకత్వంపై మంచి పట్టు ఉంది. అలాంటి లారెన్స్ ను ఒప్పించడం అంత తేలికైన విషయమేం కాదు. ఆయన ఒప్పుకున్నాడంటే ఇందులో ఏదో మేటర్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. త్వరలోనే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్