Saturday, January 18, 2025
Homeసినిమా'హంటర్'గా మారిపోయిన లారెన్స్! 

‘హంటర్’గా మారిపోయిన లారెన్స్! 

తమిళ .. తెలుగు భాషల్లో లారెన్స్ కి మంచి క్రేజ్ ఉంది. కొరియోగ్రఫర్ గా లారెన్స్ ఎన్నో ప్రయోగాలు చేశాడు. డాన్స్ మాస్టర్ గా తనదైన ముద్రవేశాడు. ఒకానొక దశలో లారెన్స్ కోసం స్టార్ హీరోలు వెయిట్ చేశారు. ఆడియన్స్ కూడా ఇది లారెన్స్ కంపోజ్ చేసిన సాంగ్ అనే గ్రహించేలా తనమార్క్ చూపించాడు. ఆ తరువాత హీరోగానే కాదు దర్శక నిర్మాతగాను సక్సెస్ లను అందుకుంటూ వెళ్లాడు.

కాలంలో కొంత వెనక్కి వెళితే లారెన్స్ ఖాతాలో ఒకప్పుడు వరుస హిట్స్ పడుతూ వచ్చాయి. ఆ మధ్య ఆయన చేసిన సినిమాలలో ‘చంద్రముఖి 2’ అభిమానులను నిరాశపరచగా, ‘జిగర్త తాండ డబుల్ ఎక్స్’ విజయాన్ని సాధించింది. లారెన్స్ నుంచి ఎక్కువగా హారర్ కామెడీ సినిమాలను ఆశించే ప్రేక్షకులు, ఇక ఆయన ‘కాంచన’ సిరీస్ పై దృష్టిపెట్టొచ్చని అనుకున్నారు. ఎందుకంటే లారెన్స్ కి ఆ సిరీస్ కాసుల వర్షాన్ని కురిపించింది. ఆయన కెరియర్ లోని భారీ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. కానీ ఆయన నుంచి యాక్షన్ థ్రిల్లర్ రానున్నట్టు తెలుస్తోంది.

లారెన్స్ తదుపరి సినిమాగా ‘హంటర్’ సెట్స్ పైకి వెళ్లింది. అందుకే సంబంధించిన పోస్టర్ నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ పోస్టర్ చూస్తుంటే .. ఇది ఫారెస్టు నేపథ్యంలో నడిచే కథ అని తెలుస్తోంది. యాక్షన్ పాళ్లు పుష్కలంగా ఉంటాయని అర్థమవుతుంది.  ఈ తరహా కంటెంట్ తో లారెన్స్ ఇంతవరకూ రాలేదు. అందువలన కొత్తగా ఆయన ఈ ట్రాక్ ను సెట్ చేసుకుని ఉండొచ్చు.  వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన మిగతా వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్