Tuesday, March 10, 2026
Homeసినిమాఆగస్టు 6న విడుదలవుతున్న ‘మ్యాడ్’

ఆగస్టు 6న విడుదలవుతున్న ‘మ్యాడ్’

మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా “మ్యాడ్”. మోదెల టాకీస్ బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి మరియు మిత్రులు ఈ చిత్రాన్ని నిర్మించారు. లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వం వహించారు. పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో నేటి యువత ఆలోచనలు ఎలా ఉన్నాయో రెండు జంటల కథతో చూపిస్తూ “మ్యాడ్” చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు లక్ష్మణ్ మేనేని. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్న “మ్యాడ్” మూవీ ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల అయ్యేందుకు రెడీ అవుతోంది.

ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ… జీవితంలో ఎంతో ముఖ్యమైన సందర్భం వివాహం. ఇలాంటి పెళ్లి విషయంలో నేటి యువత చాలా మంది సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదు. అందుకే ఎంత స్పీడ్ గా పెళ్లిళ్లు జరుగుతున్నాయో, అంతే స్పీడ్ గా విడిపోతున్నారు. ఈ పరిస్థితికి ఆ జంటలతో పాటు తల్లిదండ్రుల తొందరపాటు కూడా కారణమే. ఇలా పెళ్లి, సహజీవనం వంటి విషయాల్లో రెండు జంటలు ఎదుర్కొన్న పరిస్థితులను ఆసక్తికరంగా “మ్యాడ్” సినిమాలో తెరకెక్కించాం. ఇది మంచి రొమాంటిక్ ఎంటర్ టైనర్. ఆగస్టు 6న థియేటర్ లలో విడుదల చేయబోతున్నాం. ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాం అన్నారు.

ఈ చిత్రానికి కెమెరా : రఘు మందాటి, ఎడిట‌ర్‌ : మార్తాండ్ కె వెంకటేష్, సంగీతం : మోహిత్ రెహ్మానియాక్, లిరిక్స్‌ : ప్రియాంక, శ్రీరామ్ , ప్రొడ్యూస‌ర్స్‌ : టి. వేణుగోపాల్ రెడ్డి, బి. కృష్ణా రెడ్డి & మిత్రులు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : శ్రీనివాస్ ఏలూరు, దర్శకుడు: లక్ష్మణ్ మేనేని

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular