Wednesday, March 18, 2026
HomeTrending Newsమతాల మధ్య చిచ్చు.. బీజేపీ పని - మంత్రి హరీష్

మతాల మధ్య చిచ్చు.. బీజేపీ పని – మంత్రి హరీష్

రాష్ట్రంలో పండుతున్న ధాన్యాన్ని చూసి కేంద్రమంత్రులే ఆశ్చర్యపోతున్నారని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. ప్రభుత్వ విధానాల వల్లే ధాన్యం ఈ స్థాయిలో పండుతున్నదని చెప్పారు. రాష్ట్రంలో పంటల సమృద్ధిని చూసి కేంద్రానికి కడుపుమంటగా ఉందని విమర్శించారు. నిజామాబాద్‌ జిల్లాలోని వర్ని మండలంలో జాకోరా ఎత్తిపోతల పథకానికి స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ.. జాకోరా లిఫ్ట్‌ను చూసి విపక్షాలు జీర్ణించుకోలేక పోతున్నాయని విమర్శించారు. నిజాం నవాబులు కట్టిన ప్రాజెక్టులు తప్ప ఏడు దశాబ్దాల్లో గత ప్రభుత్వాలు కట్టినవి ఏవీ లేవన్నారు.


కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు కరెంటు, ఎరువుల కొరత ఉండేదని చెప్పారు. దానికోసం రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేసే పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉచితంగా ఇస్తున్నామని, ఎరువుల కొరత లేకుండా చూస్తున్నామని చెప్పారు. గతంలో వర్షం కోసం రైతులు ఎదురుచూసేవారని, ఇప్పుడు కాళేశ్వరం, సింగూరు వంటి ప్రాజెక్టులతో ఆకాశం వైపు చూసే పరిస్థితిలేదన్నారు.

బీజేపీ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్టాలని చూడటమే బీజేపీ పని అని విమర్శించారు. నరేంద్ర మోదీ పాలనలో బుల్లెట్‌ రైలు రాలేదుకానీ.. ఉన్న రైళ్లను, రైల్వే స్టేషన్లను అమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఎందుకు నింపడంలేదని ప్రశ్నించారు. నష్టాలను సాకుగా చూపి ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతున్న బీజేపీ సర్కార్‌ పెద్దపెద్ద పారిశ్రామిక వేత్తలకు రూ.11 లక్షల కోట్లు మాఫీ చేసిందన్నారు.

Also Read : నల్లగొండపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular