Saturday, January 18, 2025
HomeTrending Newsపఠాన్ చెరువులో పట్టణ ప్రగతి

పఠాన్ చెరువులో పట్టణ ప్రగతి

పల్లెలు,పట్టణాలను పరిశుభ్రం చేసుకొని, అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  ముఖ్యమంత్రి కెసిఆర్ పల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారని శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి తెలిపారు. ప్రజా ప్రతినిధులందరు పల్లె ,పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపు ఇచ్చారు. పఠాన్ చెరువు నియోజకవర్గంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ,ఆర్ సి పురం కార్పొరేటర్ పుష్ప నగేష్, భారతి నగర్ కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం రామచంద్రాపురం ఎమ్మార్వో ఆఫీసు పరిసరాలను శుభ్రం చేసి మొక్కలు నాటిన ప్రొటెం భూపాల్ రెడ్డి. ప్రజలు పరిశుభ్రతను పాటించి, మన ఇల్లుని ఎంత శుభ్రంగా ఉంచుకొంటమో చుట్టూ పరిసరాలను అంతే శుభ్రంగా ఉంచుకోవాలని భూపాల్ రెడ్డి సూచించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్