Thursday, March 12, 2026
Homeసినిమాఅఖిల్ పాటకు అద్భుత స్పందన

అఖిల్ పాటకు అద్భుత స్పందన

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి లిరికల్ సాంగ్ విడుదలైంది. ‘లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి‘ అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ కూడా అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు దర్శక నిర్మాతలు ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular