Saturday, March 14, 2026
Homeసినిమాచరణ్ ని వాడుకుంటున్న లియో టీమ్..?

చరణ్ ని వాడుకుంటున్న లియో టీమ్..?

విజయ్ నటించిన భారీ చిత్రం ‘లియో‘. ఈ చిత్రానికి లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఈ సినిమా ఈ నెల 19న విడుదల కానుంది. అయితే.. ఈ మూవీ టీజర్ అండ్ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత సినిమా పై మరింత ఆసక్తి ఏర్పడింది కానీ.. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మాత్రం కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. ట్రైలర్ లో అంతగా ఆకట్టుకునే సీన్స్ లేకపోవడం.. వావ్ అనిపించే యాక్షన్ సీన్స్ కనిపించకపోవడం ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. కథలో కొత్తదనం కూడా కనిపించలేదు.. దీనికి తోడు ఈ సినిమా హాలీవుడ్ మూవీకి కాపీ అంటూ ప్రచారం మొదలైంది.

దీంతో విజయ్ ఫ్యాన్స్ ఈ మూవీ ట్రైలర్ చూసి బాగా ఫీలైపోయి.. తమ కోపాన్ని ఈ సినిమా ట్రైలర్ చూపించిన థియేటర్ పై చూపించారు. థియేటర్లోని సీట్లని ధ్వంసం చేశారు. ఇలా లియో మూవీ పై నెగిటివ్ టాక్ రావడాన్ని గుర్తించిన లియో టీమ్ ఎలాగైనా సినిమా పై మళ్లీ ఇంట్రస్ట్ క్రియేట్ చేయాలి అనుకున్నారు. అందుకు రామ్ చరణ్ ను వాడుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో చరణ్ కామియో చేశారని టాక్ ను ప్రచారం చేశారు. ట్విట్టర్ లో లియో అఫిషియల్ పేజీలో కూడా చరణ్‌ ఇందులో నటించినట్టుగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఇంకేముంది నిజంగానే చరణ్ లియోలో నటించాడు అంటూ ప్రచారం ఊపందుకుంది. ఇప్పటి వరకు ఉన్న నెగిటివ్ టాక్ కు బదులు ఆడియన్స్ లో మరింతగా ఇంట్రస్ట్ క్రియేట్ అయ్యింది. ట్విట్టర్ లో లియో అఫిషియల్ పేజీగా బ్లూ టిక్ తో కనిపిస్తున్న అకౌంట్ ఓరిజినల్ అకౌంట్ కాదని.. అది ఫేక్ అకౌంట్ అని.. లియో పై నెగిటివ్ టాక్ పోయి మరింతగా ఇంట్రస్ట్ క్రియేట్ చేయడం కోసమే ఇలా చేశారని అసలు విషయం బయటకు వచ్చింది. ఇది ఎవరు చూశారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం లియోలో చరణ్ ఉన్నాడని ప్రచారం జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular