Sunday, January 19, 2025
Homeసినిమానితిన్ వర్సెస్ నిఖిల్.... గెలిచేది ఎవ‌రు?

నితిన్ వర్సెస్ నిఖిల్…. గెలిచేది ఎవ‌రు?

The Winner is…: యువ హీరో నితిన్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం. మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఎంఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ మూవీ టీజ‌ర్ అండ్ సాంగ్స్ కు అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డంతో ఈ సినిమా పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు.

రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తుండగా, అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. ఈ చిత్రంలో నితిన్, సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారిగా కనిపించనున్నారు. సముద్రఖని మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆగ‌ష్టు 12న ఈ సినిమా రిలీజ్ కానుంది.

అయితే.. ఈ మూవీకి పోటీగా నిఖిల్ న‌టించిన కార్తికేయ 2 రాబోతుంది. చందు మొండేటి డైరెక్ష‌న్ల ఓ రూపొందిన కార్తికేయ 2 పై అంచ‌నాలు భారీగానే ఉన్నాయి. ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ సినిమా ఈ నెల 22న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కొన్ని కార‌ణాల వ‌ల‌న వాయిదా వేశారు. ఆగ‌ష్టు 12న విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. దీంతో నితిన్, నిఖిల్ మ‌ధ్య బాక్సాఫీస్ ద‌గ్గ‌ర పోటీ ఏర్ప‌డింది. మ‌రి.. ఈ పోటీలో ఎవ‌రు విజేత‌గా నిలుస్తారో అనేది ఆస‌క్తిగా మారింది.

Also Read : ఇస్కాన్ టెంపుల్లో కార్తికేయ 2 టీమ్ సంద‌డి

RELATED ARTICLES

Most Popular

న్యూస్