Saturday, March 7, 2026
Homeసినిమాజూలైలో ‘లైగర్’ క్లైమాక్స్ షూటింగ్

జూలైలో ‘లైగర్’ క్లైమాక్స్ షూటింగ్

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ లైగర్. దీనికి ‘సాలా క్రాస్ బ్రీడ్’ అనేది ట్యాగ్ లైన్. పూరి, ఛార్మి, కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న ఈ మూవీలో విజయ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుంది. ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేసిందని చెప్పచ్చు. ముంబాయిలో కీలక సన్నివేశాలు చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఇక అసలు విషయానికి వస్తే.. క్లైమాక్స్ లో యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయట. అమ్మా నాన్న ఓ తమిళ అయ్మాయి, పోకిరి సినిమాల్లో ఎలాగైతే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయో అలా ఈ సినిమాలో కూడా ఎమోషనల్ సీన్స్ ఉంటాయని.. ఈ సీన్స్ హైలైట్ అనేలా ఉంటాయని తెలిసింది. తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. జులైలో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సెప్టెంబర్ 9న లైగర్ మూవీని దేశ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ.. ప్రస్తుత పరిస్థితులను బట్టి వాయిదా పడే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular