Saturday, January 18, 2025
Homeసినిమాట్రైల‌ర్ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేసిన లైగ‌ర్

ట్రైల‌ర్ రిలీజ్ ను భారీగా ప్లాన్ చేసిన లైగ‌ర్

సెన్సేష‌న‌ల్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా మూవీ లైగ‌ర్. ఇందులో విజ‌య్ స‌ర‌స‌న బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే న‌టించింది. బాక్సింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ ఫిలిం పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆగస్టు 25న ఈ భారీ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు.

లైగర్ నుండి ఇప్పటికే విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్,  ఫస్ట్ లుక్, టీజర్, రెండు పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో జూలై 21న థియేట్రికల్ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించారు. మాస్ సినిమా కాబట్టి మాస్ ట్రైలర్ లాంచ్ చేయబోతున్నట్లు తెలిపారు. లైగర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను హైదరాబాద్, ముంబై నగరాలలో నిర్వహించనున్నట్లు తాజాగా చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో జూన్ 21న ఉదయం 9.30 గంటలకు.. అంధేరీలోని సినీ పోలిష్ లో సాయంత్రం 7.30 గంటలకు ఈ ఈవెంట్ నిర్వహిస్తారు. అంతేకాకుండా  మార్కెటింగ్ గురించి లైగర్ టీమ్ డిస్కస్ చేస్తున్న ఓ వీడియోని కూడా షేర్ చేశారు.

Also Read : బోల్డ్ పిక్చర్ తో షాక్ ఇచ్చిన లైగ‌ర్ 

RELATED ARTICLES

Most Popular

న్యూస్