Sunday, January 19, 2025
HomeTrending NewsKadem Project: లక్ష్మీపూర్ లిఫ్ట్ కు లైన్ క్లీయర్

Kadem Project: లక్ష్మీపూర్ లిఫ్ట్ కు లైన్ క్లీయర్

తెలంగాణకు సంబంధించి పలు కారణాలతో పెండింగ్ లో ఉన్న 23 అభివృద్ది పనులకు కేంద్ర వన్య ప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో ఈ మేరకు చర్చించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టుపై నిర్మించ తలపెట్టిన లక్ష్మీపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ (ఖానాపూర్ పరిధి) పథకానికి వైల్డ్ లైఫ్ బోర్డ్ అనుమతులను ఇచ్చింది. సాగునీటి శాఖ ప్రతిపాదనలను అటవీ శాఖ నిబంధనల మేరకు వైల్డ్ లైఫ్ బోర్డు ద్వారా అనుమతులు సాధించింది. 3.17 హెక్టార్ల అటవీ భూమిని ఈ ప్రాజెక్టు కోసం మళ్లించేందుకు కేంద్రం అంగీకారం తెలిపినట్లు సమావేశానికి హాజరైన అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియాల్ తెలిపారు.

దీనిలో పాటు తీవ్రవాద ప్రభావిత జిల్లాల్లో రోడ్ల నిర్మాణ, వెడల్పుకు సంబంధించిన 11 ప్రతిపాదనలకు, ఐదు పంచాయితీ రాజ్ రోడ్లకు, కుమరం భీమ్ అసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ లో విద్యుత్ లైన్ ప్రతిపాదనకు నేషనల్ వైల్డ్ లైఫ్ బోర్డు ఆమోదం తెలిపింది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్