Sunday, January 19, 2025
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్అందుకే కర్ఫ్యూ పొడిగించాం: ఏకే సింఘాల్

అందుకే కర్ఫ్యూ పొడిగించాం: ఏకే సింఘాల్

ఆంధ్రప్రదేశ్‌లో క్రమంగా కరోనా కేసులు తగ్గుతున్నాయని, కానీ మరికొన్ని జిల్లాల్లో నియంత్రణలోకి రావాల్సి ఉందని అందుకే 11 తేదీ నుంచి మరో 10 రోజుల పాటు కర్ఫ్యూ పొడిగించామని ఏపీ వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 104 టెలీకన్సల్టేషన్ ద్వారా కాల్స్ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టాయని, 5వేల మంది డాక్టర్లు, 900 మంది స్పెషలిస్టులు హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నవారి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని వెల్లడించారు. అవుట్ గోయింగ్ కాల్స్ ద్వారా ఐదు లక్షల మందికి పైగా ఇప్పటి వరకూ సేవలందించామని, ప్రస్తుతం అన్ని జిల్లాల్లోనూ పాజిటివిటీ రేటు సగటున 10 శాతంగా ఉందని వివరించారు.

“తూర్పుగోదావరి, గుంటూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ క్రమంగా కరోనా పాజిటివిటీ రేటు తగ్గుతోంది. జూన్ 11 నుంచి 20 తేదీ వరకూ ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ లావాదేవీలు నిర్వహించుకునేందుకు వెసులుబాటు కల్పించాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ యథావిధిగా కర్ఫ్యూ కొనసాగుతుంది. రాష్ట్రంలో సుమారు 20వేల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుంటే అందులో 17 వేల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతోంది. ప్రైవేటు ఆస్పత్రుల్లో 6,473 మందికి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందుతోంది’’ అని అనికుమార్‌ వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్