తెలంగాణాలో లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగిసింది. పోటీలో ఉన్న వారి వివరాలను ఎన్నికల అధికారులు వెల్లడించారు. మెదక్ ఎంపీ నియోజకవర్గంలో అత్యధికంగా 53 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో 13 మంది బరిలో ఉన్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల సంఖ్య
1. మెదక్ – 53
2. భువనగిరి – 51
3. పెద్దపల్లి(ఎస్సీ) – 49
4. వరంగల్(ఎస్సీ) – 48
5. చేవెళ్ల – 46
6. సికింద్రాబాద్ – 46
7. ఖమ్మం – 41
8. హైదరాబాద్ – 38
9. మల్కాజ్‌గిరి – 37
10. మహబూబ్‌నగర్ – 35
11. కరీంనగర్ – 33
12. నిజామాబాద్ – 32
13. నల్లగొండ – 31
14. జహీరాబాద్ – 26
15. మహబూబాబాద్(ఎస్టీ) – 25
16. నాగర్‌కర్నూల్(ఎస్సీ) – 21
17. ఆదిలాబాద్(ఎస్టీ) -13
రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలకు 893 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 625 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.