Saturday, January 18, 2025
HomeTrending NewsYuva Galam: అక్వాను ఆదుకుంటాం: లోకేష్

Yuva Galam: అక్వాను ఆదుకుంటాం: లోకేష్

అధికారంలోకి రాగానే ఆక్వా రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువ గళం పాదయాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కోట్ల ఫంక్షన్ హాలులో ‘ఆక్వా రంగానికి J గ్రహణం’ పేరిట ఆక్వారైతులతో  ముఖాముఖి నిర్వహించారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే గతంలో లాగా 24 గంటలూ విద్యుత్ అందిస్తామన్నారు. యూనిట్ విద్యుత్ ను ఒకటిన్నర రూపాయికే ఇస్తామన్నారు.

ఆక్వా ఉత్పత్తులు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామని, ఉండి ప్రాంతంలో ఆక్వా యూనివర్సిటీ పిపిపి మోడల్ లో ఏర్పాటు చేస్తామని, నాణ్యమైన సీడ్ ను అందుబాటులో ఉంచుతామని చెప్పారు. రైతులు ఆక్వా ఉత్పత్తులు అమ్మేటప్పుడు పీస్ ల లెక్కన కాకుండా గ్రాముల వారీగా అమ్ముకునే ఏర్పాటు చేసేలా చూస్తామన్నారు.  పాత ధరలకే ఆక్వా రంగానికి ట్రాన్స్ ఫార్మర్లు అందజేస్తామన్నారు.

ప్రపంచంలో ఉన్న మెరుగైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆక్వా రంగానికి అనుసంధానం చేస్తామని లోకేష్ చెప్పారు. బాబు సిఎం గా ఉండగా పది కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటు చేశారని, వాటికి కనీసం లక్ష రూపాయలు కెమికల్స్ కోసం ఇవ్వలేక పోతున్నారని విమర్శించారు. రైతు ఎవరైనా రేతేనని, దానికి ఆక్వా జోన్ అని, నాన్- ఆక్వా జోన్ అని విడదీయడం సరికాదన్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని,  తాము రాగానే ఉభయ గోదావరి జిల్లాల్లో అంతటా సిసి రోడ్లు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు.

గతంలో  .5 ఉన్న ఆక్వా సెస్ (AMC) ను ఒక శాతం చేశారని, తాము దాన్ని .25 కు తగ్గిస్తామని, అందులోనూ ఇక్కడ వస్తూలైన సెస్ ను ఈ ప్రాంతం అభివృద్ధికే ఖర్చు చేస్తామని చెప్పారు.  బాబు హై వోల్టేజ్ లీడర్ అని, జగన్ లో వోల్టేజ్ లీడర్ అని అందుకే ఎప్పుడూ నీరసంగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపి కింజరాపు రామ్మోహన్ నాయుడు, స్థానిక ఎమ్మెల్యే రామరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్