Friday, March 20, 2026
HomeసినిమాLokesh-Prabhas: ప్రభాస్, లోకేష్ మూవీ అసలు నిజం ఇదే

Lokesh-Prabhas: ప్రభాస్, లోకేష్ మూవీ అసలు నిజం ఇదే

ప్రభాస్, లోకేష్ కనకరాజ్.. కాంబినేషన్ పై కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘సలార్’ … లోకేష్ కనకరాజ్ ‘లియో’ మూవీలతో బిజీగా ఉన్నారు. కోలీవుడ్ హీరో విజయ్  హీరోగా ‘లియో’ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 19న విడుదల చేయనున్నారు.  లియో తర్వాత లోకేష్ మూవీ ఎవరితో అనేది ఆసక్తిగా మారింది. రజినీకాంత్ తో మూవీ అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఖైదీ సీక్వెల్ తీయనున్నట్టుగా కూడా ప్రచారం జరిగింది. అలాగే విక్రమ్ సీక్వెల్ పాన్ చేస్తున్నట్టుగా కూడా వినిపించింది. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో లోకేష్ సినిమా అంటూ టాక్ వినిపిస్తోంది. దీంతో లోకేష్ కనకరాజ్ నెక్ట్స్ ఎవరితో అనేది కోలీవుడ్, టాలీవుడ్ లో ఆసక్తిగా మారింది.

చివరకు రజినీకాంత్ తో సినిమా ఫైనల్ అయ్యిందని తెలిసింది. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. మార్చిలో ఈ సినిమాని స్టార్ట్ చేయనున్నారని తెలిసింది. రజినీతో మూవీ తర్వాత ఖైదీ సీక్వెల్ చేస్తారట. ఈ రెండు సినిమాలు పూర్తయ్యేసరికి 2025 అవుతుంది. ఆతర్వాత ప్రభాస్ తో లోకేష్ మూవీ ఉంటుందట. అప్పటికి ప్రభాస్ ఇప్పటి వరకు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలి. ఆదిపురుష్ ప్లాప్ అవ్వడంతో బాలీవుడ్ డైరెక్టర్స్ తో సినిమా చేయడం కన్నా.. సౌత్ డైరెక్టర్స్ తో సినిమా చేయడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. ప్రభాస్, లోకేష్ కాంబోని మైత్రీ మూవీ మేకర్స్ ప్లాన్ చేస్తుందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular