Saturday, January 18, 2025
HomeTrending NewsLokesh: గంజా కేపిటల్ గా ఏపీ : లోకేష్

Lokesh: గంజా కేపిటల్ గా ఏపీ : లోకేష్

ఒకప్పుడు ఉడ్తా పంజాబ్ చూశామని, ఇప్పుడు ఉడ్తా ఆంధ్ర ప్రదేశ్  జరుగుతోందని… రాష్ట్రంలో జరుగుతోన్న ప్రతి నేరానికీ గంజాయితో సంబంధం ఉంటోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఇటీవల బాపట్లలో జరిగిన బాలుడు  అమర్నాథ్ గౌడ్ హత్య ఘటనలో కూడా నేరస్తులు గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు కూడా ఈ మత్తులోనే తన డ్రైవర్, దళిత వర్గానికి చెందిన సుబ్రహ్మణ్యం ను చంపేశాడని అన్నారు.  ఇది సాధారణం విషయం కాదని, హవాలా ద్వారా డబ్బులు పంపుతున్నారని. జాతీయ భద్రత కూడా ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. లోకేష్ నేతృత్వంలోని టిడిపి ప్రతినిధి బృందం రాజ్ భవన్ లో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ను కలిసి గంజాయి ఘటనలపై ఫిర్యాదు చేసింది.

చంద్రబాబు యహంలో జాబ్ కాపిటల్ అఫ్ ఇండియాగా ఉండేదని, ఇప్పుడు గంజా కాపిటల్ గా మారిందని… బడిలో, గుడిలో కూడా దొరికే పరిస్థితి ఉందని విమర్శించారు. దేశంలో ఎక్కడ గంజా దొరికినా మేడిన్ ఆంధ్ర ప్రదేశ్ అన్నట్లు తయారైందన్నారు. పాదయాత్రలో పలువురు మహిళలు ఈ విషయమై తనకు ఫిర్యాదు చేసినప్పుడు ఎంతో ఆవేదన కలిగిందన్నారు. అందుకే ప్రతి మీటింగ్ లో దీనిపై మాట్లాడుతున్నానని చెప్పారు. పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఈ సిఎం జగన్ కు రామ్ గోపాల్ వర్మ తీస్తున్న సినిమాపై ఉన్న శ్రద్ధ గంజాయి నిర్మూలనపై లేదని మండిపడ్డారు.

పాదయాత్రలో కావాలని రెచ్చగొడుతున్నారని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, తనకు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్