Saturday, March 29, 2025
HomeTrending Newsదిశ చట్టం ఏమైంది? లోకేష్ ప్రశ్న

దిశ చట్టం ఏమైంది? లోకేష్ ప్రశ్న

What About?: రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయని, రాష్ట్రంలో చట్టం సరిగా అమలు కావడం లేదని, ఈ ప్రభుత్వం ఆర్భాటంగా తెచ్చిన దిశా చట్టం అసలు అమల్లోనే  లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. దిశతో ఏ అక్కకు, చెల్లికి, తల్లికి ఈ ప్రభుత్వం న్యాయం చేయలేకపోయిందని ఆరోపించారు. అసలు  సొంతచెల్లికి న్యాయం చేయలేని సిఎం జగన్ ప్రజలకేం చేస్తారని ప్రశ్నించారు.  ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, పోలీసులను అడ్డు పెట్టుకొని ప్రతిపక్షం, ప్రజలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని వ్యాఖ్యానించారు. నేడు కర్నూలులో పర్యటించిన లోకేష్, గత నెల 20వ తేదీన రోడ్డు ప్రమాదంలో మరణించిన  టిడిపి నేత, మాజీ ఎంపీపీ రాజ్ వర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి, ప్రజలకు  రాజ్ వర్ధన్ రెడ్డి చేసిన సేవలను లోకేష్ గుర్తు చేసుకున్నారు.

రాష్ట్రంలోని పరిస్థితులపై కేటిఆర్ చెప్పింది వాస్తవమేనని, రాష్ట్రంలో కరెంటు, నీరు లేదని, రోడ్లపై గుంతలు ఉన్నాయని చెప్పారు. దీనిపై వైసీపీ నేతలు అంతగా ఫీలవ్వాల్సిన అవసరం లేదని, తాము ఇదే విషయాలు చెబితే దాడి చేశారని, ఇప్పుడు పక్క రాష్ట్రం మంత్రిపై కూడా అదే దాడి కొనసాగిస్తున్నారని లోకేష్ చెప్పారు. గతంలో వనజాక్షి అమె సరిహద్దులు దాటివేరే ప్రాంతంలో ఇసుక తరలిపు అడ్డుకున్నారని వివరణ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీలో ప్రజల్లో పనిచేసే వారికే గుర్తింపు ఉంటుందని, ఏసీ రూముల్లో కూర్చొని కబుర్లు చెప్పేవారికి భవిష్యత్తు ఉండదని స్పష్టం చేశారు.

Also Read కేటిఆర్ కు వంత పాడిన టిడిపి

RELATED ARTICLES

Most Popular

న్యూస్