Sunday, January 19, 2025
HomeTrending NewsYuva Galam: ప్రజావేదిక పునర్నిర్మిస్తాం: లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

Yuva Galam: ప్రజావేదిక పునర్నిర్మిస్తాం: లోకేష్ సెల్ఫీ ఛాలెంజ్

ప్రజా వేదిక శిథిలాలే జగన్ అరాచక ప్రభుత్వ పతనానికి సమాధి రాళ్ళు అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ ప్రభుత్వ విధ్వంసానికి  ప్రజావేదిక ప్రత్యక్షసాక్షిగా  నిలుస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ కూల్చివేతల పర్వం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందన్నారు.  ఈ ప్రభుత్వ 51 నెలల పాలనలో గూడు కోల్పోయిన లక్షలాది పేదల కన్నీరు దావానలంలా మారి ఈ ప్రభుత్వాన్ని కూల్చబోతోందని హెచ్చరించారు.

అధికారంలోకి రాగానే ప్రజా వేదిక పునర్నిర్మిస్తామని లోకేష్ ప్రకటించారు. జగన్ పాలనను తిరస్కరిస్తూ ప్రజలు ఇవ్వబోయే తీర్పుతో ప్రజా ప్రభుత్వం ఏర్పడబోతోందని,  ఇంకా తొలగించని ఈ శిథిలాల సాక్షిగా సరికొత్త ప్రజావేదికను నిర్మిస్తామని చెప్పారు.

లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు కృష్ణా జిల్లాలోకి ప్రవేశించింది. అంతకుముందు ప్రజా వేదిక వద్ద లోకేష్ సెల్ఫీ దిగి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్