Saturday, May 3, 2025
HomeTrending News100 Days: లోకేష్ యాత్ర నేడు 100వ రోజు: పాల్గొన్న భువనేశ్వరి

100 Days: లోకేష్ యాత్ర నేడు 100వ రోజు: పాల్గొన్న భువనేశ్వరి

తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువ గళం పాదయాత్ర నేడు 100వ రోజుకు చేరుకుంది. నిన్నటి వరకూ ఆయన 1268.9 కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు.  ప్రస్తుతం లోకేష్ యాత్ర కర్నూలు జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతోంది. నిన్న సాయంత్రం బోయరేవుల వద్ద విడిది చేశారు. నిన్న ఆదివారం మదర్స్ డే సందర్భంగా  లోకేష్ తల్లి భువనేశ్వరి బోయరేవుల విడిది కేంద్రానికి వచ్చి లోకేష్ ను సర్ ప్రైజ్ చేశారు.

నేడు 100వ రోజు యువగళం పాదయాత్రలో  నందమూరి, నారా కుటుంబ సభ్యులు లోకేష్ వెంట కలిసి నడిచారు. భువనేశ్వరి, కుటుంబ సభ్యులు లోకేశ్వరి, హైమావతి, ఇందిర… నందమూరి జయశ్రీ, దేవన్, మణి, సీహెచ్ శ్రీమాన్, సీహెచ్ చాముండేశ్వరి, గారపాటి శ్రీనివాస్, కంటమనేని దీక్షిత, కంటమనేని బాబీ, వెనిగళ్ల రాహుల్ తదితరులు ఉన్నారు.

కాగా, లోకేష్ యాత్ర  వందరోజులు పూర్తయిన సంద‌ర్భంగా పాద‌యాత్ర  విశేషాల‌తో విశేషాలతో విజయవాడకు చెందినా టిడిపి నేత కేశినేని శివనాథ్(చిన్ని)ప్రత్యేకంగా రూపొందించిన‌ ప్రత్యేక సంచిక ‘జ‌న‌హృద‌య‌మై నారా లోకేష్‌’ ను లోకేష్ ఆవిష్కరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్