Wednesday, February 26, 2025
HomeTrending Newsయుగగళం సభతో ఎన్నికల శంఖారావం: అచ్చెన్నాయుడు

యుగగళం సభతో ఎన్నికల శంఖారావం: అచ్చెన్నాయుడు

యువ గళం ముగింపు సభ ఆంధ్ర ప్రదేశ్ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుందని  తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం చేస్తోన్న అరాచకాలను తుదముట్టించేలా కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తామని వెల్లడించారు.  టిడిపి ప్రధానా కార్యదర్శి నారా లోకేష్ చేస్తోన్న యువ గళం పాదయాత్ర ఈ నెల 20న బుధవారం ముగియనుంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలం పోలిపల్లి లో  మధ్యాహ్నం 02:00 భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ , నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథులుగా పాల్గొంటున్నారు.  ఈ సభ సన్నాహక ఏర్పాట్లలో భాగంగా శ్రీకాకుళం జిల్లా నేతలు, కార్యకర్తలతో అచ్చెన్నాయుడు సమావేశమై చర్చించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ సభ ద్వారా 2024 ఎన్నికల శంఖారావం పూరిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి-జన సేన కూటమికి భారీ ఆధిక్యంతో విజయం సాధిస్తుందని పునరుద్ఘాటించారు. ప్రజలో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ ఓటమి తథ్యమని స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్