యువ సమ్రాట్ నాగ చైతన్య, ఫిదా బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం లవ్ స్టోరీ. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత రిలీజ్ అయిన పెద్ద సినిమా కావడంతో ఈ విభిన్న ప్రేమకథా చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో అనుకున్నారు. అయితే.. ఊహించని విధంగా.. అంచనాలకు మించి కలెక్షన్స్ రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర సక్సస్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్ సీస్ లో సైతం రికార్డు కలెక్షన్స్ వసూలు చేసింది. చైతన్య కెరీర్ లో లవ్ స్టోరీ మూవీ ఎప్పటికీ మరచిపోలేని చిత్రంగా నిలిచింది.
అయితే.. మూడు రోజుల్లోనే రికార్డు కలెక్షన్స్ వసూలు చేసి సంచలనం సృష్టించిన లవ్ స్టోరీ ఆతర్వాత ఏ స్ధాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది..? నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కు లాభాలు తీసుకువస్తుందా..? లేదా..? అనే అనుమానాలు ఉండేవి. ఇప్పటికీ అంచనాలను మించి కలెక్షన్స్ వసూలు చేస్తుండడం విశేషం. ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 31 కోట్లకు అమ్మడం జరిగింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇంత మేరకు కలెక్షన్లు కష్టమే అనిపించింది. కారణం కరోనా ఓ కారణం అయితే.. ఆంధ్రాలో 50 శాతం సిటింగ్ తోనే థియేటర్లు రన్ అవుతున్నాయి.
అయినప్పటికీ.. అందరి అనుమానాలను పటా పంచలు చేస్తూ ఈ సినిమా 32 కోట్ల షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించినట్లు తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లోనే ఈ సినిమా 32.34 కోట్ల వరకు షేర్ వసూలు చేసి లాభాల్లోకి వచ్చిందని సమాచారం. ఈ సినిమా ఇంకా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకెళుతుండడం విశేషం.