Saturday, January 18, 2025
Homeసినిమారికార్డులు బ్రేక్ చేస్తోన్న ‘సారంగదరియా’ సాంగ్

రికార్డులు బ్రేక్ చేస్తోన్న ‘సారంగదరియా’ సాంగ్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య – ఫిదా బ్యూటీ సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’. విభిన్న ప్రేమకధా చిత్రంగా రూపొందిన ఈ సినిమా పోస్టర్లు, పాటలకు  విశేష స్పందన వస్తోంది. ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ‘సారంగదరియా’ పాట ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. చేస్తుందో తెలిసిందే. యూట్యూబ్‌లో రికార్డులు బద్దలు కొడుతోంది.

ఈ పాట విడుదలైన నెల రోజుల్లోనే 10 కోట్ల వ్యూస్ దక్కించుకొని రికార్డు సృష్టించింది. అతి తక్కువ కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్‌ సాధించింది. ఇప్పుడు 250 మిలియన్ వ్యూస్ అనగా 25 కోట్ల వ్యూస్‌తో ఇంకా జోరు కొనసాగిస్తోంది. సినిమా విడుదలకు ముందే వ్యూస్‌తో రికార్డులు సృష్టించిన అతి తక్కువ సినిమా పాటల్లో ‘సారంగ దరియా’ ఒకటిగా నిలిచింది. దీనికి పవన్‌ సి.హెచ్‌ స్వరాలందించారు. గీత రచయిత సుద్దాల అశోక్‌ తేజ రాసిన ఈ తెలంగాణ జానపదానికి.. మంగ్లీ స్వరం.. సాయి పల్లవి నృత్యం కలిసి ఈ పాటను ప్రత్యేకంగా నిలబెట్టాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్