Monday, March 16, 2026
Homeసినిమా‘చిట్టి అడుగు’ లిరికల్ సాంగ్‌కు అద్భుత స్పందన

‘చిట్టి అడుగు’ లిరికల్ సాంగ్‌కు అద్భుత స్పందన

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్ టైన‌ర్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్’. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి ‘చిట్టి అడుగు’ లిరికల్ సాంగ్ విడుదలైంది. తాజాగా విడుదలైన ఈ పాటకు అనూహ్య స్పందన వస్తుంది. అఖిల్ స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా అయినా అఖిల్ కు కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా అవుతుందేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular