Friday, September 20, 2024
Homeసినిమావరుణ్ తేజ్ లాంచ్ చేసిన 'మా ఊరి పొలిమేర‌-2' టీజ‌ర్

వరుణ్ తేజ్ లాంచ్ చేసిన ‘మా ఊరి పొలిమేర‌-2’ టీజ‌ర్

శ్రీకృష్ణ క్రియేష‌న్స్ బేన‌ర్ పై గౌరు గ‌ణ‌బాబు స‌మ‌ర్ప‌ణ‌లో గౌరికృష్ణ నిర్మాత‌గా రూపొందుతోన్న చిత్రం ‘మా ఊరి పొలిమేర-2’. ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌కత్వం వహించారు. స‌త్యం రాజేష్‌, డా. కామాక్షి భాస్కర్ల, గెట‌ప్ శ్రీను, రాకెండ్ మౌళి, బాలాదిత్య, సాహితి దాస‌రి, ర‌వి వ‌ర్మ‌, చిత్రం శ్రీను ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు. ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని ఈ నెలాఖ‌రులో విడుద‌ల‌కు సిద్ధ‌మవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ చిత్రానికి సంబంధించిన టీజ‌ర్ ను వ‌రుణ్ తేజ్ లాంచ్ చేశారు.

ఈ సంద‌ర్భంగా వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ…“సత్యం రాజేష్ నాకు మంచి మిత్రుడు. ఓటీటీలో త‌ను న‌టించిన‌ `మా ఊరి పొలిమేర‌` చూశాను. నాకు చాలా బాగా న‌చ్చింది. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా ఇంట్రస్టింగ్ గా ఉంది. ఇప్పుడు మా ఊరి పొలిమేరకు  సీక్వెల్ గా రూపొందుతోన్న `మా ఊరి పొలిమేర‌-2` టీజ‌ర్ కూడా చాలా ఇంట్ర‌స్టింగ్ గా ఉంది. మొద‌టి పార్ట్ లా సెకండ్ పార్ట్ కూడా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటూ టీమ్ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు“ అన్నారు. ఆడియన్స్ కి థ్రిల్ కలిగించేలా టీమ్ అంతా కలసి ఎంతో పట్టుదలతో ఈ చిత్రాన్ని చేశామని.. ఖచ్చితంగా అదరికీ నచ్చుతుందని డైరెక్టర్ విశ్వనాథ్ అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్