Saturday, January 18, 2025
Homeసినిమామాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్

మాచర్ల నియోజకవర్గం ఫస్ట్ ఎటాక్

First Attack: యువ కథానాయకుడు నితిన్ మాచర్ల నియోజకవర్గం చిత్రంలో గుంటూరు జిల్లా కలెక్టర్ గా సిద్ధార్థ్ రెడ్డి అనే IAS అధికారి పాత్రను పోషిస్తున్నాడు. ఈ మాస్, యాక్షన్ ఎంటర్టైనర్ కి MS రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్తో కలిసి శ్రేష్ట్ మూవీస్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ఈ రోజు (బుధవారం) నితిన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా ఫస్ట్ ఎటాక్ (టీజర్)ని విడుదల చేశారు.

టీజర్ నితిన్ యాక్షన్ సీన్ను అద్భుతంగా ఎలివేట్ చేసింది. ముఖానికి పులి రంగు, ఒంటినిండా పులిచారలుతో వున్న కొందరు దుండగులు నితిన్ పై కొడవళ్ళతో దాడిచేయడం వారి నుంచి తను తప్పించుకోవడం తిరిగి ఎదురుదాడి చేయడం థ్రిల్ గా అనిపిస్తుంది. ఎదురుదాడికి దిగి వారిని తరిమికొట్టే విధానం ఆకట్టుకుంది. ఆ క్రమంలో కొందరిని ఎటాక్ చేసి సడన్ గా కూర్చుని మిగిలిన వారి రాక గమనిస్తూ చూసిన లుక్ అద్భుతంగా వుంది. ఈ టీజర్ అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ ఇంపాక్ట్ చూపుతుంది. వెంకట్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన యాక్షన్ సీక్వెన్స్ నితిన్ లో మాస్, యాక్షన్ చూపిస్తూ అద్భుతంగా డిజైన్ చేశారు.

నితిన్ ఈ పాత్రలో చాలా బాగా ఉన్నాడు. పూర్తి మీసాలు, చిన్నపాటి గడ్డం గెటప్తో మాస్ గా కనిపించాడు. టీజర్ను బట్టి చూస్తే, సినిమాలో కొన్ని హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి అనేది అర్ధం అవుతుంది. ప్రసాద్ మూరెళ్ల కెమెరా పనితనం అత్యున్నతంగా కనిపిస్తుంది. మహతి స్వర సాగర్ తన అద్భుతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో టీజర్ కి మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.ఈ మాచర్ల నియోజకవర్గం చిత్రాన్ని జులై 8న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది.

Also Read : ఏప్రిల్ 29న నితిన్ ‘మాచర్ల నియోజకవర్గం’

RELATED ARTICLES

Most Popular

న్యూస్