Tuesday, March 10, 2026
Homeసినిమాసెప్టెంబర్ 17న విడుదల కానున్న 'మధుర వైన్స్'

సెప్టెంబర్ 17న విడుదల కానున్న ‘మధుర వైన్స్’

సన్నీ నవీన్, సీమా చౌదరి, సమ్మోహిత్ ప్రధాన పాత్రల్లో ఆర్ కె సినీ టాకీస్ బ్యానర్ పై రాజేష్ కొండెపు నిర్మాతగా జయ కిషోర్ బండి దర్శకత్వం లో తెరకెక్కిన చిత్రం మధుర వైన్స్. గతం, తిమ్మరుసు చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఎస్ ఒరిజినల్స్ ప్రొడ్యూసర్ సృజన్ యారబోలు ఈ సినిమా కి అసోసియేట్ అవ్వడంతో  ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది. త్వరలో ఎస్ ఒరిజనల్స్ నుంచి అద్భుతం, పంచతంత్రం చిత్రాలు కూడా రాబోతున్నాయని, ‘మధుర వైన్స్’ కి సంబంధించిన ప్రచార చిత్రాలు, సాంగ్స్ ట్రైలర్స్ ప్రేక్షకులని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయని మేకర్స్ వెల్లడించారు.

సెప్టెంబర్ 17న ‘మధుర వైన్స్’ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తామని చెప్పారు. ఈ సినిమాకు మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కార్తిక్ కుమార్, జయ్ క్రిష్ సంయుక్తంగా సంగీతం సమకూరుస్తున్నారు. వర ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు తీసుకున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేస్తామని తెలిపారు దర్శక నిర్మాతలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular