Saturday, January 18, 2025
HomeTrending NewsDelhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం

Delhi Liquor Scam: ఇది వారి కుట్రే: మాగుంట అనుమానం

ఢిల్లీ లిక్కర్ స్కామ్ తో తన కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని…. అమిత్ ఆరోరాతో తాను గానీ, తన కుమారుడు గానీ ఎప్పుడూ మాట్లాడలేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. ఇది కేవలం ఆరోపణ మాత్రమేనని, దీని వెనుక నార్త్ ఇండియన్ వ్యాపారులు ఉన్నారని ఆరోపించారు, త్వరలోనే నిజాలు తెలుస్తాయన్నారు.

ఈ స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిన్న దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో తమ పేరు ప్రస్తావించడంపై మాగుంట స్పందించారు. త్వరలోనే దీని వెనుక ఉన్న వాస్తవాలు బైటకు వస్తాయని, సౌత్ ఇండియా వ్యాపారులపై నార్త్ ఇండియా వ్యాపారులు చేస్తోన్న కుట్ర అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. విజయ్ నాయర్ కు వంద కోట్లు ఇచ్చామంటూ వచ్చిన వార్తలు పూర్తిగా నిరాధారమని కొట్టిపారేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి గతంలోనే అన్ని విషయాలూ మీడియా ద్వారా చెప్పానని, త్వరలో మరోసారి మీడియా ముందుకు వచ్చి స్పందిస్తానని మాగుంట వివరించారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్