Thursday, March 19, 2026
Homeసినిమా23న ‘మహా సముద్రం’ ట్రైలర్ విడుదల

23న ‘మహా సముద్రం’ ట్రైలర్ విడుదల

విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న శర్వానంద్, సిద్దార్థ్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘మహా సముద్రం’ మీద టాలీవుడ్‌లో ఎంతటి అంచనాలు నెలకొన్నాయో అందరికీ తెలిసిందే. ‘ఆర్ ఎక్స్-100’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత దర్శకుడు అజయ్ భూపతి విభిన్న కథాంశంతో ‘మహా సముద్రం’ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 23న మహా సముద్రం ట్రైలర్‌ను విడుదల చేసేందుకు చిత్రయూనిట్ ప్లాన్ చేసింది. ఇక ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్‌లో సిద్దార్థ్, శర్వానంద్ ఇద్దరూ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తున్నారు.

యాక్షన్ సీక్వెన్స్‌లకు ఇద్దరు హీరోలు రెడీగా ఉన్నట్టు పోస్టర్‌ను చూస్తే అర్థమవుతోంది. దసరా కానుకగా అక్టోబర్ 14న రాబోతోన్న ఈ మూవీ ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ అందించిన రెండు పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌ పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు. అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. రాజ్ తోట సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోన్న ఈ చిత్రానికి ప్ర‌వీణ్ కె.ఎల్ ఎడిట‌ర్‌, కొల్లా అవినాష్ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular