Thursday, March 19, 2026
Homeసినిమాలింగుస్వామికి బ‌న్నీ, మ‌హేష్ నో చెప్పారా?

లింగుస్వామికి బ‌న్నీ, మ‌హేష్ నో చెప్పారా?

Say No: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా కోలీవుడ్ స్టార్ మేకర్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రానుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ దాదాపు ఫిక్స్.. సెట్స్ పైకి వెళ్ల‌డ‌మే ఆల‌స్యం అనుకున్నారు. ఇంత‌లో ఏమైందో ఏమో కానీ.. ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ల‌లేదు. ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో బ‌య‌ట‌కు రాలేదు. బ‌న్నీ, లింగు స్వామి వేరే ప్రాజెక్టుల్లో బిజీ అయ్యారు.

అయితే.. రామ్ తో లింగుస్వామి తెలుగు, త‌మిళ్ లో  ‘ది వారియర్’ రూపొందించారు. ట్రైల‌ర్ కు ట్రెమండ‌స్ రెస్పాన్స్ రావ‌డంతో మూవీ పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. తాజాగా  చెన్నైలో వారియర్ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ జ‌రిగింది. ఈ వేడుక‌లో బ‌న్నీ,  మ‌హేష్ సినిమాల విషయం ప్రస్తావించారు. “బన్నీతో సినిమా చేయాలనుకున్నాను. కథ కూడా చెప్పాను . కానీ ఎందుకనో కుదరలేదు. సూపర్ స్టార్ మహేష్ తో కూడా సినిమా చేయాలని ఆయన్ని అప్రోచ్ అయ్యాను. ఆయన కూడా తన కథకి నో చెప్చెపారు” అని వెల్లడించారు.  ‘మా కాంబినేషన్స్ ఎందుకు సెట్ కాలేదో తెలియదు కానీ ఇప్పట్లో అది జరిగేలా లేదని తెలిసింది’ అన్నారు. మహేష్ సంగతి పక్కనపెడితే బన్నీనే లింగు స్వామిని ఎక్కువగా డిజప్పాయిం ట్ చేసినట్లు అనిపిస్తుంది. మ‌రి.. ది వారియ‌ర్ మూవీ స‌క్సెస్ అయితే.. లింగుస్వామితో సినిమా చేయ‌డానికి బ‌న్నీ, మ‌హేష్ ఎస్ అంటారేమో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular