Sunday, January 19, 2025
Homeసినిమామహేష్‌, జక్కన్న టార్గెట్ రీచ్ అవుతారా..?

మహేష్‌, జక్కన్న టార్గెట్ రీచ్ అవుతారా..?

మహేష్‌ బాబు, రాజమౌళి కాంబినేషన్లో సినిమా అని గత కొంతకాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. ఇంకా అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వచ్చే సంవత్సరంలో ఈ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు. పాన్ ఇండియా మూవీలా కాకుండా పాన్ వరల్డ్ మూవీలా జక్కన్న ఈ చిత్రాన్ని ప్లాన్ చేస్తుండడం విశేషం. ఈ సినిమాని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అఫిషియల్ గా ప్రకటించలేదు కానీ… మహేష్ పుట్టినరోజైన ఆగష్టు 9న ఈ చిత్రాన్ని ప్రకటిస్తారని ప్రచారం జరుగుతుంది.

ఇదిలా ఉంటే… ఈ చిత్రాన్ని రాజమౌళి చాలా ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. తన గత చిత్రాల మాదిరి ఎక్కువ టైమ్ తీసుకోకుండా ఒక సంవత్సరంలోనే కంప్లీట్ చేయాలి అనుకుంటున్నారట. ప్రస్తుతం మహేష్‌ బాబు త్రివిక్రమ్ డైరెక్షన్ లో ‘గుంటూరు కారం’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతికి విడుదల అవుతుంది. ఆతర్వాత నుంచి రాజమౌళి సినిమా ప్రారంభిస్తారు. 2024లోనే ఈ సినిమాని షూటింగ్ పూర్తి చేసి… 2025లో ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్ చేయాలి.. 2025లోనే ఈ సినిమాను విడుల చేయాలి అనేది జక్కన్న ప్లాన్.

రాజమౌళితో సినిమా అంటే.. రెండు, మూడేళ్లు పడుతుంది. అందుచేత మహేష్ బాబుతో సినిమా అంటే కనీసం రెండేళ్లు పడుతుందని అంచనా. అయితే రాజమౌళి మాత్రం సంవత్సరం పాటు షూటింగ్, ఆరు నెలల పాటు పోస్ట్ ప్రొడక్షన్.. సంవత్సరంన్నరలో ఈ సినిమాను రిలీజ్ చేయాలి అనుకుంటున్నారట. ప్లాన్ బాగానే ఉంది కానీ.. రాజమౌళి క్వాలిటీ విషయంలో రాజీపడడు. అలాగే ఏ సీన్ అయినా సరే.. తను అనుకున్న విధంగా వచ్చే వరకు కాంప్రమైజ్ కాడు. అందుచేత  2025లో సినిమాను రిలీజ్ చేయాలనే టార్గెట్ రీచ్ కావడం కాస్త కష్టమే. మరి… మహేష్‌, జక్కన్న టార్గెట్ రీచ్ అవుతారో లేదో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్