Friday, March 20, 2026
Homeసినిమాథియేటర్లలోనే చూడండి: మ‌హేష్ లేఖ‌

థియేటర్లలోనే చూడండి: మ‌హేష్ లేఖ‌

Sarkaru: సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రానికి ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టించింది. భారీ అంచ‌నాల‌తో ఈ సినిమా మే 12న ప్ర‌పంచ వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహేష్‌ తన అభిమానులను ఉద్దేశించి ఓ బహిరంగ లేఖ రిలీజ్ చేశారు. ఇందులో ప్రియమైన అభిమాన మిత్రులకు అని సంబోధించిన అగ్ర హీరో.. ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమాని థియేటర్లలో చూసి స్పందన తెలియజేయాలని కోరారు.

అంతే కాకుండా.. మాట‌ల మాంత్రికుడు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై య‌స్.రాధాకృష్ణ (చిన‌బాబు) నిర్మించే చిత్రం రెగ్యుల‌ర్ షూటింగ్ జూన్ మొద‌లు కాగ‌ల‌దు అని తెలియ‌చేశారు.  ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాన్ని ఆశించే మీ శ్రేయోభిలాషి అని మహేష్ బాబు ఈ లేఖలో పేర్కొన్నారు. తమ అభిమాన హీరో తమని ఉద్దేశిస్తూ ఇలా ఓపెన్ లెటర్ విడుదల చేయడంతో సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular