Sunday, January 19, 2025
HomeసినిమాMahesh-Trivikram: మహేష్ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడా..?

Mahesh-Trivikram: మహేష్ అలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడా..?

సూపర్ స్టార్ మహేష్‌ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నారు. అతడు, ఖలేజా తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తున్న మూడవ చిత్రమిది. ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూట్ చేసిన తర్వాత  యాక్షన్ సీన్స్ నచ్చకపోవడంతో మొత్తం కథనే మార్చేశారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టోరీతో మూవీ చేస్తున్నారు. అంతకు మించి కథ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇదిలా ఉంటే.. మహేష్ క్యారెక్టర్ లో నెగిటివ్ షేడ్స్ ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటివరకు చేసిన సినిమాల్లో మహేష్ క్యారెక్టర్స్ లో పాజిటివ్ షేడ్సే కానీ.. నెగిటివ్ షేడ్స్ లేవు. దీనితో ఈ వార్త క్యూరియాసిటీ  పెంచింది. మరో వార్త ఏంటంటే.. ఇందులో మహేష్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని  అంటున్నారు. దీని పై అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ లేదు.

ఇక ఈ సినిమాలో మహేష్ కు జంటగా పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళీ భాషల్లోనూ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ భారీ ఎత్తున నిర్మిస్తోన్న ఈ సినిమాకు ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను మే 31న విడుదల చేయనున్నారు. అలాగే టైటిల్ కూడా అదే రోజు ప్రకటించనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్