Wednesday, March 26, 2025
Homeసినిమామౌంటెన్‌ డ్యూ బ్రాండ్‌ ప్రచారకర్తగా మహేష్‌బాబు

మౌంటెన్‌ డ్యూ బ్రాండ్‌ ప్రచారకర్తగా మహేష్‌బాబు

Mahesh – Another Brand:
యువతకు స్ఫూర్తి కలిగించాలనే తమ ప్రయత్నాలను కొనసాగిస్తూ… మౌంటెన్‌ డ్యూ ఇప్పుడు సుప్రసిద్ధ నటుడు, సూపర్‌స్టార్‌ మహేష్‌బాబును తమ బ్రాండ్‌ ప్రచారకర్తగా ఎన్నుకున్నట్లు వెల్లడించింది. మౌంటెన్‌ డ్యూ-మహేష్‌బాబు భాగస్వామ్యంతో బ్రాండ్‌ మరింత విస్తరించి ‘డర్‌ కే ఆగే జీత్‌ హె’ సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్ళనుంది.

ఈ సందర్భంగా మహేష్‌బాబు మాట్లాడుతూ “ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో భయపడతారని నేను భావిస్తున్నాను. సినీ నటులు కూడా అందుకు మినహాయింపేమీ కాదు. మనం ధైర్యంగా, అజేయంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అయితే.. తనలోని భయాలను, స్వీయ సందేహాలను అధిగమించేందుకు హద్దులను సైతం వెనుక్కినెట్టేసేవాడే అసలైన హీరో. మౌంటెన్‌ డ్యూ యొక్క ఫిలాసఫీ ‘డర్‌ కే ఆగే జీత్‌ హై’ ఎప్పుడూ కూడా నన్ను బలంగా ప్రతిధ్వనిస్తుంది. ఎందుకంటే.. అది నా నమ్మకానికి అనుగుణంగా ఉంటుంది. అసాధారణత వైపు నన్ను నేను నెట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతుంటాను. త్వరలో మా ప్రేక్షకుల కోసం మాయాజాలం చేయడానికి మౌంటెన్‌ డ్యూతో చేతులు కలపడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను” అన్నారు

Also Read : ప్రతి భాషలో నటించాలని ఉంది :  కేతిక శర్మ

RELATED ARTICLES

Most Popular

న్యూస్