Friday, March 13, 2026
Homeసినిమాకృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేసే ఆలోచనలో మహేష్‌

కృష్ణ మెమోరియల్ ఏర్పాటు చేసే ఆలోచనలో మహేష్‌

సూపర్ స్టార్ కృష్ణకి మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడం పై సూపర్ స్టార్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చిరస్థాయిగా నిలిచిపోయేలా స్మారక చిహ్నం నిర్మించే విధంగా ప్రైవేట్ స్థలంలో దహన సంస్కారాలు చేయాలి. అయితే.. మహేష్ ఎందుకు అలా ఆలోచించలేదని అంటున్నారు. సాధారణంగా లెజండరీ వ్యక్తులు చనిపోయినప్పుడు వారి అంత్యక్రియలు వారి ప్రైవేట్ స్థలంలో నిర్వహించి.. ఒక స్మారక చిహ్నంగా నిర్మిస్తుంటారు. కృష్ణ అంత్యక్రియలను కూడా పద్మాలయా స్టూడియోస్ లో నిర్వహించి ఉంటే బాగుండేదని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

అయితే.. కృష్ణ కోసం స్మారక చిహ్నం కాకుండా ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని మహేష్ బాబు ఆలోచన చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. కృష్ణ సినిమాలకు సంబంధించిన విశేషాలు మరియు అవార్డులను లో ఉంచాలని అనుకుంటున్నారట. పద్మాలయా స్టూడియోస్ వద్ద కృష్ణ మెమోరియల్ ను ఏర్పాటు చెయ్యొచ్చని అంటున్నారు. ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఏ లెజండరీ నటుడికి కూడా ఇలాంటి లేదు. ఇప్పుడు కృష్ణ కోసం కుటుంబ సభ్యులు స్మారక మందిరం ఏర్పాటు చేసి అభిమానుల సందర్శనార్థం ఉంచితే మంచి ఆలోచనే అవుతుంది.

ఏదేమైనా కృష్ణ ఇక లేరనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణంచుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్ స్టార్ కు వీడ్కోలు పలుకుతున్నారు. లెజండరీ నటుడు మరణించినా.. వారి సినిమాలతో జ్ఞాపకాలతో ఆయన చేసిన సేవలతో ఎప్పటికీ చిరస్మరణీయులుగానే మిగిలిపోతారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా కృష్ణ మెమొరియల్ ఏర్పాటు చేయడం గురించి మహేష్‌ బాబు అధికారికంగా ప్రకటిస్తారేమో చూడాలి.

Also Read : ఆకాశంలో ఒక తార సూపర్ స్టార్ కృష్ణ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular