Saturday, January 18, 2025
Homeసినిమాసెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి మహేశ్ బాబు!

సెప్టెంబర్ నుంచి సెట్స్ పైకి మహేశ్ బాబు!

మహేశ్ బాబు – రాజమౌళి కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందనుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. రాజమౌళి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులలోనే ఉన్నారు. ఈ సినిమా కోసం మహేశ్ బాబు బరువు పెరగవలసి ఉంది. అందువలన ఆ దిశగా ఆయన వర్కౌట్స్ నడుస్తున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్ షూటింగు సెప్టెంబర్ నుంచి మొదలవుతుందని అంటున్నారు. ఆ దిశగానే పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ కొత్తగా ఉండనుంది. అలాగే ఫైట్స్ విషయంలోను .. పాటల విషయంలోను కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.  అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ కూడా కొత్తగా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి తెలుగు తెరపై ఒక వినూత్నమైన ప్రయోగం జరగనుందని అంటున్నారు.

రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాను రెండు భాగాలుగా చేస్తారని అనుకున్నారు .. కానీ అలా జరగలేదు. అయితే మహేశ్ బాబు సినిమా మాత్రం రెండు భాగాలుగా చేసే ఆలోచనలో ఉన్నాడని చెబుతున్నారు. ఆల్రెడీ ఫస్టు పార్టు ఎక్కడివరకూ అనే విషయంలో కూడా ఒక క్లారిటీ వచ్చేసినట్టుగా సమాచారం. ఓ హాలీవుడ్ సంస్థతో కలిసి కే ఎల్ నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా, సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్