Sunday, January 19, 2025
Homeసినిమాదుబాయ్ లో క‌థా చ‌ర్చల్లో..  మ‌హేష్, త్రివిక్రమ్

దుబాయ్ లో క‌థా చ‌ర్చల్లో..  మ‌హేష్, త్రివిక్రమ్

Mahesh-Trivikram Combination: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేష‌న్లో వచ్చిన అత‌డు, ఖ‌లేజా చిత్రాలు ఇద్దరికీ  మంచి పేరు తీసుకు వచ్చాయి. వీరిద్ద‌రూ క‌లిసి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నారు. ఆఖరికి ఇప్పటికి సెట్ అయ్యింది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట చిత్రం పూర్తయిన తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

ప్రస్తుతం మహేష్ బాబు రెస్ట్ లో ఉన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి దుబాయ్‌లో నూతన సంవత్సర వేడుకలను జరుపుకోనున్నారు. అయితే.. మ‌హేష్ తో క‌థాచ‌ర్చలు జ‌రిపేందుకు త్రివిక్రమ్, థ‌మ‌న్, నాగ‌వంశీ దుబాయ్ వెళ్లారు. ఈ విష‌యాన్ని మ‌హేష్ బాబు ట్విట్టర్ ద్వారా తెలియ‌చేస్తూ.. వ‌ర్క్ అండ్ చిల్ అంటూ ఫోటోను పోస్ట్ చేశారు. మ‌హేష్ పోస్ట్ చేసిన ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి

Also Read : ‘రెక్కీ’ ఫస్ట్ లుక్ విడుదల

RELATED ARTICLES

Most Popular

న్యూస్