Sunday, January 19, 2025
Homeసినిమాప్రభాస్ రికార్డ్ ను క్రాస్ చేయనున్న మహేష్‌

ప్రభాస్ రికార్డ్ ను క్రాస్ చేయనున్న మహేష్‌

ప్రభాస్, మహేష్‌.. వీరిద్దరి మధ్య పోటీ ఏర్పడింది. ప్రభాస్ ‘ప్రాజెక్ట్ కే‘, మహేష్ ‘గుంటూరు కారం’ సంక్రాంతికి పోటీపడనున్నట్టుగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సినిమా బడ్జెట్ విషయంలో వీరిద్దరూ పోటీపడుతుండడం విశేషం. ఒకప్పుడు సినిమా బడ్జెట్ వంద కోట్లు అంటే.. అమ్మో వంద కోట్లా అనేవారు. ఇప్పుడు తెలుగు సినిమా బడ్జెట్ వందల కోట్లు అయ్యింది. ఆదిపురుష్ సినిమా బడ్జెట్ 500 కోట్ల నుంచి 600 కోట్లు అయ్యిందని టాక్ వినిపించింది. ఆర్ఆర్ఆర్ సినిమాకి 400 కోట్లు బడ్జెట్ అయ్యింది. ఇప్పుడు ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో రెండు చిత్రాలు రూపొందుతున్నాయి.

ఆ రెండింటిలో ఒకటి ప్రభాస్ ప్రాజెక్ట్ కే. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై సి.అశ్వనీదత్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దాదాపు 600 కోట్ల నుంచి 700 కోట్లు బడ్జెట్ అవుతుందని టాక్. అమితాబ్, కమల్, ప్రభాస్ ఇలా ఉద్దండులు కలిసి నటిస్తున్న సినిమా ఇది. కాబట్టి అంత ఖర్చు పెడుతున్నారు అనడంలో తప్పులేదు. బాలీవుడ్ కాదు.. హాలీవుడ్ టార్గెట్ గా ప్రాజెక్ట్ కే తెరకెక్కుతోంది. ఈ సంక్రాంతికి రిలీజ్ అన్నారు కానీ.. సమ్మర్ కి వస్తుందని.. ఇది రెండు పార్టులుగా రానుందని వార్తలు వస్తున్నాయి.

ఇప్పటి వరకు ఇండియాలోనే అత్యధిక బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే రూపొందుతుంది అనుకుంటే.. ఇప్పుడు ఈ చిత్రానికి మించి దాదాపు 1500 కోట్ల భారీ బడ్జెట్ తో మహేష్‌ బాబు, రాజమౌళిల సినిమాను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై డా.కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కూడా స్టార్లు సందడి చేయనున్నారు. అలాగే రాజమౌళి కూడా హాలీవుడ్ టార్గెట్ గా ఈ పాన్ వరల్డ్ మూవీని రూపొందిస్తున్నారు. వచ్చే సంవత్సరం ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. అయితే.. ఇప్పటి వరకు భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ కే. దీనిని వెంటనే క్రాస్ చేసే సినిమా మహేష్‌, రాజమౌళి సినిమా. ఇండియాలోనే అత్యధిక భారీ బడ్జెట్ తో నిర్మించే చిత్రాలు రెండు కూడా తెలుగు సినిమాలు కావడం విశేషం. మరి.. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాయో చూడాలి.

RELATED ARTICLES

Most Popular

న్యూస్