Thursday, March 12, 2026
Homeసినిమాసెట్స్ పైకి వచ్చిన ‘సర్కారు వారి పాట’

సెట్స్ పైకి వచ్చిన ‘సర్కారు వారి పాట’

సూపర్ స్టార్ మహేష్‌ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మహేష్ బాబు సరసన మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్ టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.  ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తి చేశారు. ఆ తర్వాత షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్రారంభించగా.. కరోనా సెకండ్ వేవ్ వచ్చి బ్రేక్స్ వేసింది.

జులై 12 సోమవారం హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ తిరిగి ప్రారంభించారు. ఈ షెడ్యూల్ లో మహేష్‌ బాబు, మిగిలిన తారాగణం పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని తెలియచేస్తూ.. మహేష్ తో పరశురామ్ ఏదో డిస్కష్ చేస్తున్నట్లు కనిపించే ఓ ఫోటోని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆర్.మధి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని 2022 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular