Friday, March 20, 2026
Homeసినిమా'బాలీవుడ్' వ్యాఖ్య‌ల పై క్లారిటీ ఇచ్చిన మ‌హేష్‌

‘బాలీవుడ్’ వ్యాఖ్య‌ల పై క్లారిటీ ఇచ్చిన మ‌హేష్‌

I mean…:  సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ‘స‌ర్కారు వారి పాట‘ సినిమాలో న‌టించారు. మేజ‌ర్ సినిమాను నిర్మించారు. ఈ రెండు సినిమాల ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఇటీవ‌ల ఏర్పాటు చేసిన మీడియా మీట్ లో బాలీవుడ్ గురించి మ‌హేష్ బాబు చేసిన వ్యాఖ్య‌లు హాట్ టాపిక్ అయ్యాయి. ఇంత‌కీ విష‌యం ఏంటంటే.. బాలీవుడ్ లో ఎంట్రీ ఎప్పుడు ? అని మ‌హేష్ ని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. “తెలుగు ఇండస్ట్రీని విడిచి ఇతర ఇండస్ట్రీలలో పని చేయాలనే ఆలోచన లేదు. తెలుగు సినిమాలతోనే మరింత ఎత్తుకు ఎదగాలనుకుంటున్నాను” అన్నారు.

“టాలీవుడ్‌లో నాకు ఉన్న ఆదరణ, ప్రేమాభిమానాల గురించి మాటల్లో చెప్పలేను. వాటిని వదులుకొని వేరే పరిశ్రమ వైపు వెళ్లాలనే ఆలోచన నాకు లేదు. నా కెరీర్ స్టార్ట్ చేసిన‌ప్ప‌టి నుంచి తెలుగులోనే సినిమాలు చేస్తాన‌ని చెబుతున్నాను. ఇప్పుడూ అదే మాట చెబుతున్నాను. బాలీవుడ్ నుంచి ఎన్నో ఆఫ‌ర్స్ వ‌చ్చాయి కానీ.. నో చెప్పాను. బాలీవుడ్ న‌న్ను భ‌రించ‌లేదు. అక్క‌డికి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోలేను” అన్నారు.

మ‌హేష్ బాలీవుడ్ గురించి చేసిన వ్యాఖ్య‌లు బీటౌన్ లో హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన మ‌హేష్ పీఆర్ టీమ్… “మహేష్ బాబు చెప్పిన మాటల్ని బాలీవుడ్ మీడియా వక్రీకరించి చూపిస్తుంది. మొదటి నుండి తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే సినిమాలు చేస్తున్నాను కాబట్టి.. ఇక్కడే తనకి సౌకర్యవంతంగా ఉంటుందని మహేష్ అన్నారు. తెలుగు సినిమాలను చేసేందుకు ఇష్టపడతానన్నారు తప్ప… బాలీవుడ్‪ని ఎక్కడా అవమానించలేదు. తక్కువ చేసి కూడా మాట్లాడలేదు. ఆయనకి అన్ని భాషలపై గౌరవం ఉంది. దయచేసి ఆయన అనని మాటలను అన్నట్లుగా క్రియేట్ చేయవద్దు. త్వరలో రాజమౌళితో చేసే సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల ఉంటుందని గమనించగలరు” అని మహేష్ పీఆర్ టీమ్ వివరణ ఇచ్చింది.

Also Read : ‘పోకిరి’ మీట‌ర్ లో ‘స‌ర్కారు వారి పాట’ : మ‌హేష్ బాబు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular