Saturday, January 18, 2025
Homeసినిమాస‌ర్కారు వారి పాట వాయిదా ప‌డ‌నుందా..?

స‌ర్కారు వారి పాట వాయిదా ప‌డ‌నుందా..?

Sarkar-Pls. wait: సూపర్ స్టార్ మహేష్ బాబు, మ‌ల‌యాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘స‌ర్కారు వారి పాట‌‘.  ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను తొలుత సంక్రాంతికి విడుదల చేయాలనుకున్నారు కానీ.. ఆర్ఆర్ఆర్ కోసం వాయిదా వేశారు. ఆ త‌ర్వాత క‌రోనా రావ‌డం.. మ‌హేష్ బాబు స‌ర్జ‌రీ చేయించుకోవ‌డంతో షూటింగ్ ఆల‌స్యం అయ్యింది. అయితే.. ఈ భారీ చిత్రాన్ని మే 12న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

ఈ మూవీ కోసం ఎంతో ఆతృత‌గా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్న ఓ వార్త ఆందోళన కలిగిస్తోంది. ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే.. ఆగమేఘాల మీద ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు ప్లాన్ చేసినప్పటికీ… అనుకున్నంత స్పీడ్‌గా ఈ షూటింగ్ జరగడంలేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అందుక‌నే మ‌రోసారి సర్కారు వారి పాట వాయిదా పడుతుందని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే.. రీసెంట్‌గా ఉగాదికి సందర్భంగా రిలీజ్‌ చేసిన సర్కారు పోస్టర్‌లో మే 12న విడుద‌ల అని మ‌రోసారి ప్ర‌క‌టించిన‌ప్ప‌టికీ.. సినిమా వాయిదా అనే టాక్ మాత్రం ఆగ‌డం లేదు. మ‌రి.. ప్ర‌చారంలో ఉన్న ఈ వార్త‌ల పై స‌ర్కారు వారి యూనిట్ స్పందించి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.

Also Read : త్వరలో ‘స‌ర్కారు వారి…’ మాస్ పాట

RELATED ARTICLES

Most Popular

న్యూస్