Saturday, January 18, 2025
Homeసినిమాఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : మహేష్ బాబు

ఈ విజయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది : మహేష్ బాబు

Forever:  మహేష్ బాబు ప్రతిష్టాత్మక చిత్రం ‘సర్కారు వారి పాట’. ప‌ర‌శురామ్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ల పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగానిర్మించారు. మే 12 ప్రేక్షకుల ముందుకు  వచ్చి అన్నివర్గాల ప్రేక్షకులను అలరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా నాగులు రోజుల్లో 153+ కోట్లు వసూళు చేసి బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

ఈ నేపధ్యంలో సర్కారు వారి పాట మాస్ సక్సెస్ సెలబ్రేషన్స్ ని కర్నూల్ లో ఘనంగా నిర్వహించారు. సూపర్ స్టార్ మహేష్ బాబుతో నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ సహా చిత్ర యూనిట్ ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఒక మాస్ మూమెంట్ చోటు చేసుకుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది.

సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ ”ఒక్కడు సినిమా షూటింగ్ జరిగినప్పుడు కర్నూల్ వచ్చాను. రెండు రోజుల వ్యవధిలో ‘సర్కారు వారి పాట’ వేడుక ఇక్కడ పెట్టుకున్నాం. అయితే.. ఇంత మంది వస్తారని అనుకోలేదు. మీ అందరినీ చూసిన ఉత్సాహంలో స్టేజ్ పైకి వచ్చి డ్యాన్స్ చేశాను. ఇది మీ కోసమే. మీ అభిమానం ఎప్పుడు ఇలానే వుండాలి. ఇది సక్సెస్ మీట్ లాగా లేదు. వంద రోజులు వేడుక చేసుకున్నట్లు వుంది. ఈ సినిమా మా ఫ్యామిలీతో చూసినప్పుడు మా అబ్బాయి గట్టిగా హాగ్ చేసుకున్నాడు. సితార పాప అన్ని సినిమాల్లో కంటే ఇందులో బాగా చేశానని, అందంగా వున్నాని చెప్పింది”

“నాన్నగారు చూసి .. పోకిరి దూకుడుకి మించిపొతుందని అన్నారు. ఈ క్రెడిట్ దర్శకుడు పరశురామ్ కి దక్కుతుంది. ఈ సినిమాని అంత చక్కగా డిజైన్ చేశారు. ఈ సినిమా కోసం ప్యాండమిక్ లో చాలా కష్టపడ్డాం కానీ.. ప్రేక్షకులు ఇచ్చిన విజయం ఆ కష్టాన్ని మర్చిపోయాం. ఈ సినిమాలో పని చేసిన ప్రతి టెక్నిషియన్ కి థ్యాంక్స్. కీర్తి సురేష్ అద్భుతంగా చేసింది. సముద్రఖని గారు కూడా చక్కగా చేశారు. తమన్ వండర్ ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. మైత్రీ మూవీ మేకర్స్ గురించి ఎంత చెప్పిన తక్కువే”

“సర్కారు వారి పాటని చాలా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. నేను వాళ్లకి శ్రీమంతుడు ఇచ్చాని ఎప్పుడూ థ్యాంక్స్ చెబుతుంటారు కానీ.. ఈ రోజు నాకు సర్కారు వారి పాట లాంటి ఘన విజయం ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్స్ ని ఇక్కడ చూడటం ఆనందంగా వుంది. సర్కారు వారి పాట విజయం ఎప్పటికీ గుర్తిండిపోతుంది. నాన్నగారి ఫ్యాన్స్, నా అభిమానులు ఎప్పుడూ నా గుండెల్లో వుంటారు. ఇంత బ్లాక్ బస్టర్ ఇచ్చిన ప్రేక్షకులందరికీ అందరికీ కృతజ్ఞతలు” అన్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్