Sunday, January 19, 2025
Homeసినిమామ‌ళ్లీ వెండితెరపైకి 'పోకిరి'

మ‌ళ్లీ వెండితెరపైకి ‘పోకిరి’

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్లో రూపొందిన సంచ‌ల‌న చిత్రం పోకిరి. ఈ సినిమా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో అంద‌రికీ తెలిసిందే. 2006లో రిలీజైన పోకిరి ప‌లు రికార్డులు బ‌ద్ద‌లుకొట్టింది. ఈ మూవీ వ‌చ్చి 16 సంవ‌త్స‌రాలు అయినా ఇంకా క్రేజ్ త‌గ్గ‌లేదు. ఇప్ప‌టికీ టీవీల్లో పోకిరి వ‌స్తే మిస్ అవ్వ‌కుండా చూస్తారు జ‌నాలు.  ప్ర‌సారమైన ప్ర‌తిసారి మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంటోంది.

ఇప్పుడు మ‌రోసారి వెండితెర పైకి పోకిరి వస్తోంది. ఆగ‌ష్టు 9న మ‌హేష్ బాబు పుట్టిన‌రోజు  సంద‌ర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ప‌లు థియేట‌ర్లో ఈ సినిమాను రిలీజ్ చేయ‌బోతున్నారు. 4కె అల్ట్రా హెచ్ డి, డాల్బీ ఆడియో టెక్నాలిజీతో ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. ఈ మేర‌కు మ‌హేష్ అభిమానులు సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప‌లు థియేట‌ర్లో పోకిరి స్పెష‌ల్ షోస్ వేసేందుకు మ‌హేష్ అభిమాన సంఘాలు సంప్ర‌దింపులు చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఈ మూవీలోని ‘ఎవ‌డు కొడితే దిమ్మ‌తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ అని మ‌హేష్ చెప్పిన డైలాగ్ ను  ఓ సెన్సేషన్ అయ్యింది. మ‌హేష్ స‌ర‌స‌న ఇలియానా న‌టించగా మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. త్వ‌ర‌లో పోకిరి మూవీ స్పెష‌ల్ షోల‌కు సంబంధించిన టిక్కెట్ల‌ను బుక్ మై షో, పేటిఎం వంటి ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో విక్ర‌యించ‌నున్న‌ట్లు స‌మాచారం.

RELATED ARTICLES

Most Popular

న్యూస్