Sunday, January 19, 2025
Homeసినిమామ‌హేష్‌, రాజ‌మౌళి మూవీకి నమ్రత కొర్రీ?

మ‌హేష్‌, రాజ‌మౌళి మూవీకి నమ్రత కొర్రీ?

Not Now? సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు, ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళిల క్రేజీ కాంబినేష‌న్లో ఓ భారీ చిత్రం రూపొంద‌నుంద‌ని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై ప్ర‌ముఖ నిర్మాత డా.కే.ఎల్ నారాయణ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. క‌రోనా టైమ్ లో ఓ న్యూస్ ఛాన‌ల్ కి ఇచ్చిన ఇంట‌ర్ వ్యూలో రాజ‌మౌళి మాట్లాడుతూ.. ఆర్ఆర్ఆర్ త‌ర్వాత మ‌హేష్ బాబుతో సినిమా చేయ‌నున్న‌ట్టుగా అఫిషియ‌ల్ గా అనౌన్స్ చేశారు.
అయితే.. మరో మూడేళ్ళ వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం లేదని ఓ వార్త‌ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వాస్తవానికి పదకొండేళ్ల క్రిత‌మే మహేష్, జక్కన్న మధ్య ఓ క్రేజీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరిగాయి. ఇద్దరూ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటం వల్ల ఇది చర్చల దశలోనే ఉండిపోయింది.

అయితే.. ఆఖ‌రికి వీరి కలయికలో మూవీ చేయనున్నట్లు ప్ర‌క‌టించారు. మహేష్ సైతం ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నట్లు పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ అడ్వెంచర్ స్టోరీ రెడీ చేస్తున్నట్లు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఆ మధ్య ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలియ‌చేశారు. అయితే.. ఈ మూవీ 2025 కి వాయిదా పడిందని టాక్ వినిపిస్తోంది. కార‌ణం ఏంటంటే.. మహేష్ బాబుని జక్కన్న బల్క్ డేట్స్ అడుగగా.. దీనికి నమ్రత వైపు నుంచి అభ్యంతరం వస్తోందట. అందుక‌నే ఈ ప్రాజెక్ట్ 2025కి వాయిదాప‌డింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే.. ఇది వాస్త‌వ‌మా  కాదా అనేది తెలియాల్సివుంది.

RELATED ARTICLES

Most Popular

న్యూస్