Wednesday, March 26, 2025
HomeTrending NewsUSA: అమెరికాలో రోడ్డు ప్రమాదం...పాలమూరు విద్యార్థి మృతి

USA: అమెరికాలో రోడ్డు ప్రమాదం…పాలమూరు విద్యార్థి మృతి

అమెరికా లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లా భూత్పూర్‌ మండలం కప్పట గ్రామానికి చెందిన బోయ మహేశ్ (25)పై చదువుల కోసం గత డిసెంబర్‌లో అమెరికా వెళ్లాడు. అక్కడ కాంకోర్డియా యూనివర్శిటీలో ఎమ్‌ఎస్‌ (MS) చేస్తున్నాడు.

మంగళవారం రాత్రి తన ముగ్గురు స్నేహితులు శివ, శ్రీలక్ష్మి, భరత్‌తో కలిసి లాంగ్‌ డ్రైవ్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో వీరు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టుకు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహేశ్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మిగతావారు తీవ్రంగా గాయపడ్డారు. మహేశ్‌ మరణ వార్తను అతని కుటుంబ సభ్యులకు బుధవారం సమాచారం అందించారు. దీంతో కప్పట గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మహేశ్‌ మృతదేహాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
RELATED ARTICLES

Most Popular

న్యూస్