Sunday, January 19, 2025
Homeసినిమాత్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేసిన మహేష్‌

త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేసిన మహేష్‌

మహేష్‌ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ, క్రేజీ మూవీ ‘గుంటూరు కారం’. ఈ మూవీ నుంచి రిలీజ్ చేసిన టీజర్ కు అనూహ్య స్పందన వచ్చింది. 24 గంటల్లోనే 25 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతడు, ఖలేజా చిత్రాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా గుంటూరు కారం వస్తుండడంతో అటు అభిమానుల్లోను, ఇటు ఇండస్ట్రీలోను భారీ అంచనాలు ఏర్పడ్డాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఏమాత్రం రాజీపడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రాన్ని ముందుగా ఆగష్టు 11న రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ.. షూటింగ్ అనుకున్న ప్లాన్ ప్రకారం జరగకపోవడంతో రిలీజ్ డేట్ మార్చారు. సంక్రాంతికి విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించారు. అయితే.. సంక్రాంతికి రిలీజ్ అంటే ఇంకా చాలా టైమ్ ఉంది కదా అనుకుంటున్నారో ఏమో కానీ.. చాలా స్లోగా షూటింగ్ జరుగుతుందట. అందుకనే మహేష్ బాబు త్రివిక్రమ్ కి టార్గెట్ ఫిక్స్ చేశారట. ఇంతకీ టార్గెట్ ఏంటంటే.. అక్టోబర్ నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయాలని మహేష్‌ చెప్పారని తెలిసింది. ఈ సినిమా పూర్తి చేసి మహేష్ రాజమౌళితో చేయనున్న మూవీ వర్క్ స్టార్ట్ చేయాలి.

ఈ నెల 7 లేదా 10 నుంచి తాజా షెడ్యూల్ హైదరాబాద్ లో స్టార్ట్ కానుంది. మహేష్‌ బాబు పై కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన పూజా హేగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. గుంటూరు కారం టీజర్ ను బట్టి మహేష్ క్యారెక్టర్ ఎంత మాస్ గా ఉంటుందో తెలియడంతో మాస్ ఆడియన్స్ తో మరింత ఆసక్తి ఏర్పడింది. మరో టీజర్ ను మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగష్టు 9న రిలీజ్ చేయనున్నారు.

RELATED ARTICLES

Most Popular

న్యూస్